బాధ్యత గల ప్రభుత్వం చోద్యం చూస్తోంది...!
November 14,2019 04:30 PM
ఏపీ లో ఏర్పడిన ఇసుక కొరత పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా
వ్యవహరిస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇసుక కొరత వాళ్ళ
భవననిర్మాణ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఇక ఈ సమస్య పై
పోరాడేందుకు ఇప్పటికే జనసేన పార్టీ లాంగ్ మార్చ్ నిర్వహించింది. అయినా
ప్రభుత్వం దిగిరాలేదు. ఇక రాష్ట్రము లో ఇసుక కొరత కారణంగా భవననిర్మాణ
కార్మికులు అహ్మహత్యాలు చేసుకుంటున్న నేపథ్యం లో వారికీ అండగా తెలుగుదేశం
అధినేత చంద్రబాబు నాయుడు నేడు నిరసన దీక్ష చేపట్టారు. నేడు విజయవాడలో ఆయన
తన దీక్షను నిర్వహించారు. ఈ దీక్షకు తెలుగుదేశం శ్రేణులు భవన
నిర్మాణకర్మకులు పెద్దఎత్తున్న తరలి వచ్చారు. ఇసుక కొరత వల్ల ప్రాణాలు
కోల్పోయిన భవన నిర్మాణ కార్మికుల చిత్రపటాల దగ్గర నివాళులర్పించారు
చంద్రబాబు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మీద సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు
చేశారు టిడిపి అధినేత. ఇసుక అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే అధికార
పార్టీ నాయకులు అదే పనిగా దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు
చంద్రబాబు.
లాంగ్ మార్చ్ నిర్వహించిన పవన్ పై వ్యక్తిగత విమర్శలు
చేశారని అలాంటి విమర్శలు మీపైనా, మీ కుటుంబంపైన చేస్తే తట్టుకోగలరా అని
ప్రశ్నించారు చంద్రబాబు. అధికార నేతలకే కాదు తమకు కూడా ధైర్యం
ఉందని,తిట్టడం చేతకాక కాదు తిట్టాలనుకుంటే వాళ్ళ కంటే ఎక్కువగా
తిట్టగలుగుతాము, కాని సభ్యత అడ్డం వస్తుందని గుర్తుపెట్టుకోమని తాను
దుర్మార్గులని హెచ్చరిస్తున్నట్లు తెలియజేశారు. ఒక జనసేన నాయకుడు ఇసుక
లాంగ్ మ్యాచ్ చేస్తుంటే ఆయనపైన వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అని
అలాంటి వ్యక్తిగత విమర్శలు చేస్తే మీరు తట్టుకోగల్గుతారా మీ కుటుంబం
గురించి చెప్పలేమా అని బాబు తన ఆవేదనను వ్యక్తం చేశారు.వైసీపీకి ఒక అవకాశం
ఇచ్చిన పేద ప్రజలకు మరణశాసనం కావాలా అని ప్రశ్నించారు టీడీపీ అధ్యక్షుడు
చంద్రబాబు. ఏది మంచిదో ఒక్కరోజు కూడా ఆలోచించడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలోని డబ్బంతా సీఎం దగ్గరే ఉండాలా? అని ప్రశ్నించారు. పోలీసులతో
తప్పుడు కేసులు పెట్టిస్తూ.. రాష్ట్రాన్ని వల్లకాడు చేయాలనుకుంటున్నారా?
అని నిలదీశారు చంద్రబాబు. మమ్మల్ని తిటే సమయం మీరు ఉపయోగించుకోని ఈ పేద
వాళ్లకు ఉచిత ఇసుక ఇవ్వండి, ఇసుక సరఫరా చేయండి చాతనైతే, చాతకాకపోతే మేము
దద్దమ్మలమని ఒప్పుకోని రాష్ట్రానికి క్షమాపణలు చెప్పాల్సన అవసరం ఉందని బాబు
ఘాటైన విమర్శలు చేశారు.ఇక చంద్రబాబు చేస్తున్న దీక్ష పై బుద్ద వెంకన్న
స్పందించారు. చంద్రబాబు చేస్తున్న దీక్షకు తరలి రావాలని ప్రజలను కోరారు.
"చనిపోయిన కార్మికుల కుటుంబాలకు అండగా.. ఉపాధి కరువైన కార్మికులకు బాసటగా
తెదేపా అధినేత చంద్రబాబు గారు ఈరోజు నిరసన దీక్ష చేపట్టారు. రండి..
చంద్రన్న అండగా కార్మికులకు బాసటగా నిలుద్దాం. వైసీపీ అసమర్థతను నిలదీస్తూ
వారి అక్రమాలను ప్రశ్నిద్దాం." అని బుద్ధా వెంకన్న తన ట్విట్టర్ లో
రాసుకొచ్చారు.
మరో వైపు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సీనియర్
నటి, టీడీపీ నాయకురాలు దివ్యవాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు
ఇసుక దీక్ష కార్యక్రమంలో మాట్లాడిన దివ్యవాణి... వైసీపీ ప్రజాసమస్యలపై
మాట్లాడకుండా ఇతర అంశాలపై మాట్లాడి సమస్యను తప్పుదోవ పట్టిస్తోందని
మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం సర్కార్ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం
ప్రవేశపెట్టడం వెనుక అసలు కారణం వేరే ఉందని ఆమె ఆరోపించారు. తెలుగుదేశంలో
తెలుగు ఉందని... అందుకే తెలుగు భాషను లేకుండా చేయాలని సీఎం జగన్
చూస్తున్నారని దివ్యవాణి విమర్శించారు. ఇంగ్లీష్ భాష ముఖ్యమే అని... అయితే
అది తెలుగును డామినేట్ చేసే విధంగా ఉండకూడదని ఆమె సూచించారు.