లక్ష మందితో సాహో వేడుక..!!
August 16,2019 08:32 AM
ప్రభాస్ సాహు ప్రీ రిలీజ్
ఈవెంట్ ఈ నెల 18 వ తేదీన భారీ ఎత్తున జరగబోతున్నది.రామోజీ ఫిలిం సిటీలో ఈ
వేడుకను నిర్వహిస్తున్నారు. ఇందులో సాహో యూనిట్ అంతా పాల్గొనబోతున్నది.
దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాహుబలి తరువాత చేస్తున్న
సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
రెండు
తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు ఈ వేడుకకు హాజరవవుతారని
సమాచారం. దాదాపుగా లక్షమంది అభిమానులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశాలు
ఉన్నాయని తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం ఏర్పాట్లు
చేస్తున్నారు. ముంబైలో సాహో ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా, హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని యూనిట్ నిర్ణయం
తీసుకుంది. అలానే చెన్నై, బెంగుళూరు, కోచిలో ప్రమోషన్ ఈవెంట్స్ చేయడానికి
ప్లాన్ చేస్తున్నారు.