గూగుల్‌లో అత్యధికంగా
ఎవరిని వెతుకుతున్నారో తెలుసా..? మోడీ కంటే, షారూఖ్ ఖాన్ కంటే, ఇతర సినిమా
సెలబ్రిటీల కంటే ఆ ఒక్క పేరే తెగ సెర్చ్ అవుతోంది. ఆ పేరు మరెవరిదో కాదు.
సన్నీలియోన్. ఆమె కోసం తెగ వెతుకుతున్నారు నెటిజన్లు. ఇంటర్నెట్
సెర్చింగ్‌లో ఈసారి కూడా టాప్ పొజీషన్లో నిలిచింది సన్నీలియోన్. పోర్న్
స్టార్‌గా పాపులారిటీ సాధించిన సన్నీ.. ఆ తర్వాత పోర్న్ సినిమాలు వదిలేసి
వెండితెర బాట పట్టింది.
ఇక, ఆమె అందానికి ఫిదా అయిపోయిన బాలీవుడ్
ఇండస్ట్రీ వరుస అవకాశాలు ఇచ్చింది. దీంతో ఓ వెలుగు వెలుగుతోంది. మరోవైపు
అవకాశం వచ్చినప్పుడు తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాలి సినిమాల్లోనూ
ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్టైన్ చేసింది. అయితే, సన్నీలియోన్ కోసం
నెటిజన్లు తీవ్రంగా సెర్చ్ చేస్తున్నారని గూగుల్ తెలిపింది. ప్రధాని మోడీ,
సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ హీరోలు షారుఖ్, అమీర్, సల్మాన్ ఖాన్ ఇలా అందరి
కంటే ఎక్కువగా సన్నీ లియోన్ కోసమే సెర్చ్ చేస్తున్నారట.