ఆంధ్రప్రదేశ్లో నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్రంలో గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారు. జిల్లాల్లో ఈ వ్యవస్థను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారానే సంక్షేమ పథకాల అందజేత... లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టనుంది. పరిపాలనలో వలంటీర్లు వ్యవస్థ కీలకంగా మారనుంది. కాగా, రెండున్నర లక్షల మంది వలంటీర్లను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ నియమించింది... ప్రతీ వలంటీరుకు నెలకు రూ. ఐదు వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వనుంది ప్రభుత్వం. ఈ సందర్భంగా వలంటీర్లు విధి విధానాలను రూపొందించి.. రూట్ మ్యాప్ ఖరారు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.