టీమిండియా
కెప్టెన్ విరాట్ కోహ్లీ దెబ్బకు ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు
బద్దలయ్యాయి.. కోహ్లీ రికార్డుల మోతకు వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డే
వేదికైంది. వన్డే ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు (238 వన్డేల్లో
11,406) సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించిన కోహ్లీ... 311
వన్డేల్లో 11,363 పరుగులు చేసిన సౌరవ్ గంగూలీ రికార్డును బద్దలు కొట్టాడు.
మరోవైపు విండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన మరో రికార్డు నెలకొల్పాడు
టీమిండియా కెప్టెన్. 64 ఇన్సింగ్స్‌లు ఆడిన 2032 పరుగులు చేసిన ఆటగాడిగా
పాక్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ పేరుతో ఉన్న రికార్డును బ్రేక్
చేశాడు. కేవలం 35 ఇన్నింగ్స్‌లోనే ఆ రికార్డును బ్రేక్ చేయడం ద్వారా ఓ
జట్టుపై అత్యంత వేగంగా 2వేలకు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా
రికార్డులకెక్కాడు. దీంతో 26 ఏళ్ల రికార్డును బద్దలైపోయింది. మరోవైపు ఈ
రెండు దేశాల మధ్య కరీబియన్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు సెంచరీలు చేసిన
ఏకైక ఆటగాడిగా నిలిచిన విరాట్ కోహ్లీ... రెండు సెంచరీలు చేసిన డెస్మండ్
హేన్స్ రికార్డును అధిగమించాడు. మొత్తానికి ఒకే దెబ్బకు మూడు పిట్టలు
అన్నట్టుగా ఒకే మ్యాచ్‌లో రికార్డుల మోత మోగిస్తూ.. మూడు రికార్డులు
నెలకొల్పాడు.