వెంకటేష్..
నాగ చైతన్య హీరోలుగా చేస్తున్న సినిమా వెంకీ మామ. ఈ సినిమా షూటింగ్
వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే సినిమా చాలా వరకు కంప్లీట్ చేసుకుంది.
బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు
బయటకు వస్తున్నాయి. అందులో ఒకటి సినిమా బడ్జెట్.
ఈ
సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని వినికిడి. సురేష్ ప్రొడక్షన్స్
సంస్థ నిర్మాణం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. వీలైనంత మేర ఖర్చు
తగ్గించుకోవాలని, పరిమితి బడ్జెట్ లోనే సినిమాలు చేయాలనే నిబంధనలు
ఉన్నాయి. వీటిని కాదని ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు అంటే ఆలోచించాల్సిన
విషయమే. కాశ్మీర్లో చిత్రీకరించిన మిలటరీ సీన్స్ కోసం ఎక్కువ ఖర్చు
చేసినట్టు వినికిడి. ఇందులో ఎన్ని నిజాలు ఉన్నాయో తెలియాలంటే సినిమా
రిలీజ్ వరకు ఆగాల్సిందే.